ఎంపీ చొరవతో అందుబాటులోకి పెట్రోల్, డీజిల్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరాయి. గత రెండు రోజులుగా జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు తీవ్రమైన కొరత నెలకొన్న విషయం తెలిసిందే.  సరఫరా లేక, బంకులు మూతపడ్డాయి. తాజాగా బీఆర్ఎస్ ఎంపీ, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అయిన వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) చొరవ ఫలితంగా జిల్లాలో 24 గంటల్లో పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. ఆయిల్ సరఫరా కంపెనీలైన బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి ఆయిల్ ట్యాంకర్లను రిటైల్ అవుట్‌లెట్‌లకు తక్షణమే పంపి కొరతను నివారించాలని సూచించారు. దీంతో ఆయా కంపెనీలు స్పందించి సరఫరాను వేగవంతం చేశాయి. దీంతో ఖమ్మం జిల్లాకు సోమవారం 150 ఆయిల్ ట్యాంకర్ల లోడు సరఫరా కాగా, మంగళవారం మరో 100 ట్యాంకర్ల లోడు సరఫరా కానుంది. మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దు: ఎంపీ

ప్రజలెవరు ఆందోళన చెందొద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. పెట్రోల్, డీజిల్ కొరతపై చొరవ చూపాలని తాము కోరిన వెంటనే ఆయా కంపెనీల ఉన్నతాధికారులతో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర‌కు (Vaddiraju Ravichandra) ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర ప్రగడ రంగనాథ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి మంజుల కృతజ్ఞతలు తెలిపారు. డీలర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా మెరుగుపడినందున.. అన్ని బంకులు ఎప్పటిలాగానే యధావిధిగా వినియోగదారులకు తమ సేవలందిస్తాయని పేర్కొన్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>