కలం, వెబ్ డెస్క్ : అమరావతిని(Amaravati) అధునాతన వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానంను (Oncology Center) అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం, అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా (AstraZeneca), స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రోగులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ రకాన్ని ఖచ్చితంగా గుర్తించడం, సరైన చికిత్సా విధానాన్ని ఎంపిక చేయడం వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రెసిషన్ ఆంకాలజీ విధానం (Oncology Center) ద్వారా ప్రతి రోగి శరీరంలోని జన్యు మార్పులను విశ్లేషించి, వారికి సరిపోయే లక్ష్యిత చికిత్సలను అందించే అవకాశం ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
Read Also: డ్రగ్స్ కేసులో ఈడీ వేట.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు!
Follow Us On: Instagram

