అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెకీ మృతి!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో జరిగిన ప్రమాదం (New Jersey Accident)లో ప్రాణాలు కోల్పోయారు. దీపారెడ్డి తన భర్త రామకృష్ణారెడ్డితో కలిసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ న్యూజెర్సీలో స్థిరపడ్డారు.

రోజువారీ లాగే కారులో ప్రయాణిస్తున్న ఆమె, న్యూజెర్సీలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్వగ్రామానికి చెందిన మహిళ మరణించడంతో ఆకుతోటపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also: ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>