epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నవీన్ మిట్టల్, దానకిషోర్.. ఇకపైన స్పెషల్ సీఎస్‌లు

కలం డెస్క్ : ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీలుగా (Principal Secretary) పనిచేస్తున్న ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా (Special Chief Secretaries) పదోన్నతి కల్పించింది. వారి పే స్కేల్ మాట్రిక్స్ ను సైతం అప్‌గ్రేడ్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి లేదా వారు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ప్రధాన కార్యదర్శి (Chief Secretary) రామకృష్ణారావు విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. వీరిద్దరికీ పదోన్నతి కల్పించినా ప్రస్తుతం వారు పనిచేస్తున్న శాఖల్లోని బాధ్యతల్లోనే కొనసాగుతారని, కానీ వారి పదవి మాత్రం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటుందని వివరించారు. నవీన్ మిట్టల్ ప్రస్తుతం ఇంధన శాఖ (Energy Department)లో, దాన కిషోర్ (Labour and Employment Department)లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. ఇకపైన కూడా అవే శాఖల్లో స్పెషల్ సీఎస్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Read Also: ఒకే గొడుగు కిందకు మూడు కీలక విభాగాలు : పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>