కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2025 జట్టులో శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు దక్కకపోవడానికి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) హయాంలో భారత జట్టు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటం ప్రారంభించిందని, ఆ శైలికి గిల్ సెట్ కాలేకపోయాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ జట్టుపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ సందర్భంగానే గిల్‌పై వేటు పడటానికి రోహిత్ శర్మను బాధ్యుడిని చేశాడు అశ్విన్ .
భారత జట్టు దూకుడు శైలికి సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు మరింత అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నాడు. ‘‘శుభ్‌మన్ గిల్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉంది. అతన్ని నేరుగా వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేశారు. సెలెక్టర్లు అతనిపై పెద్ద నమ్మకం ఉంచారు. కానీ అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో మేనేజ్‌మెంట్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. టీ20ల్లో ఓపెనింగ్ స్థానానికి గిల్ ఏమాత్రం సరిపోడదని, టీమ్ కాంబినేషన్ దృష్ట్యా అతన్ని తప్పించడం ఆశ్చర్యకరం కాదని అశ్విన్ (Ashwin) వ్యాఖ్యానించాడు.
‘‘టీ20 ప్రపంచకప్‌కు(T20 WC) ఎంపికైన భారత జట్టు బలంగా ఉంది. పవర్‌ప్లేలో భారత్ వినూత్నంగా, దూకుడుగా ఆడుతోంది. గత ప్రపంచకప్‌లోనే రోహిత్ శర్మ ఈ విధానాన్ని స్టార్ట్ చేశాడు. అదే శైలిని కొనసాగించాలని మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే సంజూ శాంసన్, అభిషేక్ శర్మలకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వారు అద్భుతంగా రాణిస్తున్నారు’’ అని అశ్విన్ చెప్పాడు.
Read Also: ఆ ఒక్క నిర్ణయమే భారత్ ఓటమిని శాసించింది
Follow Us On: Youtube


