కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు: మంత్రి దామోదర

కలం, మెదక్ బ్యూరో: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే పదవులు దక్కుతాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha)  అన్నారు. సంగారెడ్డిలో పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని ఆకాంక్షించారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బలమని.. కార్యకర్తలే ధైర్యం, స్టైర్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఇతర నేతలు నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.

Read Also: తెలంగాణ మరో బంగ్లాదేశ్‌గా మారుతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>