భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు కసరత్తులు షురూ అయ్యాయి. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సీజేఐ నుంచి ప్రతిపాదన కోరింది. దీంతో గవాయ్(CJI Gavai).. జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు.
ఈ ఏడాది మే నెలలో బీఆర్ గవాయ్.. సీజేఐగా పదవి చేపట్టారు. ఆయన పదవి నవంబర్ 23తో ముగియనుంది. సాధారణంగా ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం పూర్తవడానికి 30 రోజుల ముందు నుంచే తదుపరి సీజేఐ నియామకాన్ని కేంద్రం చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర న్యాయశాఖ.. కొత్త సీజేఐ నియామకాన్ని ప్రారంభించింది. అయితే భారత 53వ న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే.. ఆయన పదవి నవంబర్ 24 నుంచి 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు.
జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant).. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 10 ఫిబ్రవరి 1962న జన్మించారు. 24 మే 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: అవినీతి విషయంలో రాజీ లేదు: సీఎం

