కలం వెబ్ డెస్క్ : రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త దారిలో ప్రజలను బురిడీ కొట్టించి లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల అవగాహనా రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొందరు సైబర్ కేటుగాళ్లు ట్రాఫిక్ చలాన్ల(Traffic Challan) పేరుతో ఓ వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో ట్రాఫిక్ చలాన్ల గురించి ఓ సందేశం వచ్చింది. ఇందులో ఓ ఏపీకే ఫైల్ ఉంది. చలాన్ల గురించే కావచ్చు అని భావించిన బాధితుడు లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే క్రెడిట్ కార్డు నుంచి రూ.5 లక్షలు కట్ అయ్యాయి.
భారీ మొత్తంలో నగదు కట్ అవడంతో మోసపోయాయని గుర్తించిన బాధితుడు విజయవాడ (Vijayawada) సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసాలపై (Cyber Crime) అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఫోన్‌లో వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
Read Also: పెన్షనర్లకు సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్!
Follow Us On: Instagram


