కలం, వెబ్ డెస్క్: ఆర్థిక వ్యవస్థలో భారత్ (India Economy) దూసుకుపోతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కీలక అడుగులు వేయడంతో నాల్గవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2025 నాటికి జపాన్‌ను అధిగమించి ఈ మైలురాయికి చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశ నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి 4.187 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా. ఈ క్రమంలో ఇండియా జపాన్ కంటే ముందుంది. జపాన్ GDP 4.186 ట్రిలియన్ డాలర్లు. గత సంవత్సరం ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇండియాకు ఇది మంచి పురోగతి. తయారీ, సేవలు, దేశీయ వినియోగంలో బలమైన వృద్ధి ప్రపంచ ర్యాంకింగ్స్‌లోపైకి ఎదగడానికి సహాయపడింది.
ప్రస్తుత వృద్ధి వేగంతో రాబోయే రోజుల్లో భారత్ జర్మనీని (Germany) అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదికలు చెబుతున్నాయి. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామంపై నీతి ఆయోగ్ సీఈఓ (B. V. R. Subrahmanyam) మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా (America), చైనా, జర్మనీ మాత్రమే భారతదేశం కంటే ముందున్నాయని అన్నారు. వృద్ధి వేగం ఇలానే కొనసాగితే రాబోయే రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (India Economy) అవతరించగలదని ఆయన అన్నారు.
Read Also: యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మంలో కేసు నమోదు
Follow Us On: Youtube


