కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో పూనమ్ కౌర్ (Poonam Kaur) ఒకరు. ఏ విషయమైనా సూటిగా మాట్లాడుతుంది. సినీ నటులు, పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే.. ఘాటుగా స్పందిస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు డైరెక్టర్ త్రివిక్రమ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎక్స్‌వేదికగా మరోసారి త్రివిక్రమ్‌పై సంచలన కామెంట్స్ చేసింది.
‘‘స్త్రీలను హింసించి, వారికి మానసిక క్షోభను మిగిల్చి, ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులు. ఇలాంటి వారికి మద్దతు ఇచ్చే మీడియా, బాధ్యతను ప్రశ్నించని ‘మా’ (MAA) అసోసియేషన్ వంటి సంస్థల వల్లే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఒక చిన్న వ్యాఖ్యను పట్టించుకునే మీరు, ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్లే మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి’’ అన్నారు నటి పూనమ్ కౌర్.
పూనమ్ కౌర్ గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)పై అనేక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. మహిళలపై ఏదైనా అనుచిత ఘటనలు జరిగితే తరుచుగా త్రివిక్రమ్‌ను టార్గెట్‌గా చేసి కామెంట్స్ చేస్తుంటుంది. పూనమ్ (Poonam Kaur) పవన్ కళ్యాణ్‌పై కూడా ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేసింది.
Read Also: వెరీ డిజప్పాయింట్.. 2025లో ఘోరంగా నిరాశపర్చిన టాప్ 3 సినిమాలు!
Follow Us On: Pinterest


