Mobile Popup Ad
Mobile Popup Ad

పర్వాలేదనిపించిన చెన్నై.. కేకేఆర్ టార్గెట్ 193

కలం, వెబ్ డెస్క్:  చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్‌కే (CSK), కేకేఆర్ మ్యాచ్‌లో చెన్నై పర్వాలేదనిపించింది. ప్రస్తుతం 200 అనేది యావరేజ్ స్కోర్‌గా ఉంటే.. సీఎస్‌కే అంత స్కోర్ కూడా చేయలేకపోయింది. సంజూ శాంసన్ మరోసారి 48 బరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచినా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నైకి దక్కిన అత్యంత శుభవార్త ఏమిటంటే.. యువ సంచలనం ఆయుష్ మాత్రే (38) మెరుపు ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్ (48) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ త్వరగానే నిష్క్రమించినా, ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి రన్ రేట్‌ను పెంచాడు. మిడిలార్డర్‌లో ‘బేబీ ఏబీ’ డెవాల్డ్ బ్రెవిస్ (41) ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో శివమ్ దూబే, జేమీ ఓవర్టన్ అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. 193 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగుతున్న కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు చెన్నై బౌలర్లు సిద్ధమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>