కలం డెస్క్: తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగుల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీసులు అన్నీ జనవరి 1 వరకు ఖాళీ చేయాలని ఆదేశించారు. కొత్త ఏడాది నుంచి ప్రతి ఆఫీసు గవర్నమెంట్ బిల్డింగ్ లోనే కొనసాగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా ప్రభుత్వ బిల్డింగుల్లో అడిషనల్ స్పేస్ ఉందని.. వాటిని గుర్తించి అక్కడకు ఆఫీసులను షిఫ్ట్ చేసుకోవాలని సూచించారు. జవనరి 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసులు కచ్చితంగా గవర్నమెంట్ బిల్డింగుల్లోనే కొనసాగాలని చెప్పారు సీఎస్ రామకృష్ణారావు.
ఫిబ్రవరి 1 నుంచి ఎలాంటి ప్రైవేట్ బిల్డింగులకు అద్దె కట్టొద్దని హెచ్ వోడీలను ఆదేశించారు సీఎస్(CS Ramakrishna Rao). ఒకవేళ ఎవరైనా గడువు దాటాక అద్దె చెల్లిస్తే దానికి సంబంధించిన సెక్రటరీ, హెచ్ వోడీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.
Read Also: బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
Follow Us On: Instagram


