రొనాల్డో పెళ్ళి వార్తలపై క్లారిటీ!

కలం, స్పోర్ట్స్ : పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) రీఎంట్రీపై మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన తర్వాత రొనాల్డోకు అల్-నాజర్ క్లబ్ అదనపు విశ్రాంతిని మంజూరు చేసింది. ఆటగాడిపై ఒత్తిడి పెంచకుండా కోచింగ్ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ అదనపు విరామం వల్ల రొనాల్డో అల్-ఫతే, అల్-దిరియా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆగస్టు 21న అల్-రియాద్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ఆయన మైదానంలోకి అడుగుపెట్టే అవకాశముంది. ఈ క్రమంలో రొనాల్డో తన భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారమయ్యాయి.

మాదేరాలోని ఒక చర్చి వద్ద వేలాది మంది అభిమానులు పెళ్లి జరుగుతుందనే ఆశతో గుమిగూడారు. అయితే ఎలాంటి వివాహ వేడుక జరగకపోవడంతో ఆ వార్తలు ఒట్టి పుకార్లేనని తేలింది. ఈ ప్రచారంపై రొనాల్డో సోదరి ఎల్మా తీవ్రంగా స్పందించారు.

రొనాల్డో స్వయంగా చెప్పనప్పుడు పెళ్లి వార్తలు ఎందుకు రాస్తున్నారని ఆమె ప్రశ్నించారు. స్వయంగా రొనాల్డో కూడా ఈ పెళ్లి పుకార్లపై నవ్వుతున్న ఎమోజీలతో స్పందిస్తూ ఆ వార్తలను తోసిపుచ్చారు. వివాహ ప్రచారాన్ని పక్కన పెడితే, రొనాల్డో పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడమే అల్-నాజర్ క్లబ్‌కు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>