కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వైరా (Wyra Accident) పరిధిలోని గండగలపాడు సాయిబాబా గుడి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ తీవ్ర ప్రమాదంలో కారు ముందరి భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు కారు క్యాబిన్‌లోనే చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గడ్డపారల సహాయంతో శ్రమించి కారు భాగాలను తొలగించి బాధితులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం వైరా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

