Mobile Popup Ad
Mobile Popup Ad

భువనగిరిలో సీపీఎం ఆందోళన.. ఈడీ చర్యలపై మండిపాటు

కలం, భువనగిరి: బీజేపీ (BJP) ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ పేరుతో విపక్షాలపై చేస్తున్న వికృత చేష్టలను తక్షణమే మానుకోవాలని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ (Md Jahangir) డిమాండ్ చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడులను సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈడీ దాడులకు నిరసనగా బుధవారం భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విపక్ష నాయకులను, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు సీపీఎం భయపడబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలెగాని జయరాములు, గడ్డం వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, అన్నంపట్ల కృష్ణ, సుందర్, రాంబాబు తదితరులు ఉన్నారు.

Read Also: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఇదిగో ఫ్రీ యాప్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>