ఏపీలో రాబోయే 3 గంటల్లో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ విభాగం (AP Weather) చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. అయితే నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.

గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

Read Also: విద్యా శాఖ కార్యాల‌యంలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళ‌న‌

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>