కలం, వెబ్ డెస్క్: టీజీపీఎస్సీ, యూపీఎస్సీ సహా వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు రూ.వేలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాలంటే ఎంతో ఇబ్బంది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందినవారికి ఇది స్థోమతకు మించిన భారమే. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ఉపయోగంగా ఉండాలని ఫ్రీ ఆన్ లైన్ కోచింగ్ యాప్ (Free Coaching App) అందుబాటులోకి తెస్తున్నట్లు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రకటించారు.
దీనిలో అన్ని రకాల సబ్జెక్టులతో పాటు మోడల్ క్వశ్చన్ పేపర్లు, నిపుణుల సలహాలు, సూచనలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ నెల 28న ఖమ్మం లైబ్రరీలో ఈ యాప్ (Free Coaching App) ఆవిష్కరించడంతో పాటు దాన్ని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించబోతున్నట్లు రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) కోరారు. నిరుద్యోగ యువత ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, లాగిన్ అయి.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వొచ్చని సూచించారు.
Read Also: శుభవార్త.. స్కూల్ పుస్తకాల ధరల తగ్గింపు
Read Also: డిజిటల్ విప్లవం

