యాదగిరిగుట్టలో కళాకారుల సమస్యలపై సిపిఐ వినతి

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) లో నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు ప్రదర్శనల అవకాశాలు కల్పించాలని సిపిఐ(CPI) జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన, సిపిఐ(CPI) ప్రతినిధి బృందంతో కలిసి దేవస్థానం ఈవో భవాని శంకర్‌ను ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాల వంటి పెద్ద వేదికలపై వీరికి అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే యాదగిరిగుట్ట (Yadagirigutta) కొండపై ఉన్న పలు స్థానిక సమస్యలను ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>