Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్, రేవంత్ బర్త్‌డే విషెస్

కలం, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారని కొనియాడారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారని చెప్పారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న చంద్రబాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను… సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను చంద్రబాబుకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>