Mobile Popup Ad
Mobile Popup Ad

ధరల పెరుగుదలపై నిజామాబాద్‌‌లో సీపీఐ నేతల నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద సీపీఐ(ఎం.ఎల్) పార్టీ నేతలు ఆందోళన చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నా, ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వీటి ధరలను తగ్గించాలన్నారు. అలాగే, సర్ పేరుతో బీజేపీని వ్యతిరేకిస్తున్న వారి ఓటు హక్కు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక రంగాన్ని, ప్రజల జీవన స్థితిగతులను చిన్నాభిన్నం చేసిందన్నారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, జిల్లా నాయకులు వెంకన్న, రాజేశ్వర్, గంగాధర్, సుధాకర్, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు సంధ్యారాణి, గణేష్, అనిల్ కుమార్, అషుర్, సాయిబాబా, ఒడ్డెన్న, సాయరెడ్డి, భాస్కరస్వామి, విఠల్ , అమూల్య, రమేష్, చరణ్, సాయిలు, గంగాధర్, సృజన్, మానస, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>