కలం, వరంగల్ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను (Bandi Bhagirath) రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. చట్టాలను పాలకులు చుట్టాలుగా మార్చుకుంటూ పేదలపై ప్రతాపం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో హనుమకొండ మండలశాఖ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ శిబిరం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు తప్పు చేస్తే ఎన్ కౌంటర్‌లు చేసే ప్రభుత్వాలు పెద్దలకు మాత్రం నోటీసులతో సరి పెడుతున్నారని విమర్శించారు.
సిట్ వేయడానికి కారణం ఏమిటి?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ (Bandi Bhagirath) విషయములో ఇదే జరుగుతోందన్నారు. ఈ కేసు విషయములో సిట్ వేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అదే సామాన్యుడి విషయములో ఇది జరుగుతుందా అని ప్రశ్నించారు. బండి భగీరథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. బండి భగీరథ్ పై తక్షణమే విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ శిక్షణా తరగతులలో హనుమకొండ సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, ప్రొఫెసర్ మార్క శంకర్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రధాని పొదుపు మంత్రంతో తెలంగాణకు చిక్కులు
Follow Us On : WhatsApp

