కలం, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత (CP Swetha) శుక్రవారం హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ ఆమెకు స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా వసతులను వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి డివైఎస్ఓను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
విద్యార్థుల క్రీడా శిక్షణ, విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ప్రోత్సహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సీపీతో పాటు వరంగల్ డీఎఫ్ఓ, ములుగు డీఎఫ్ఓలు జెఎన్ఎస్ స్టేడియాన్ని, స్విమ్మింగ్ పూల్ ని సదర్శించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, స్టేడియం సిబ్బంది, కోచ్‌లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

