మేడారంలో కారు ప్రమాదం.. బాలుడి మృతి

కలం, ములుగు: మేడారం (Medaram)లో జరిగిన కారు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని అమీర్ పేటకి చెందిన ఓ కుటుంబం శుక్ర‌వారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి మేడారం వచ్చింది. దర్శనం అనంతరం విడిది చేస్తున్న గది వద్ద కౌశిక్ అనే బాలుడు ఆడుకుంటున్నాడు. కారులో ఉన్న నాలుగేళ్ల బాలుడు సాకేత్ కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఈ ఘటనలో కౌశిక్ కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనానికి వస్తే బాలుడు మృతి చెంద‌డంతో బాధిత కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>