కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ఎవరూ రావొద్దని తెలిపారు. నాంపల్లిలోని ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగి.. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని.. దీంతో నాంపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో నుమాయిష్ (Numaish Exhibition) కు ప్రజలు రావొద్దని.. అవసరం అయితే ఈ రోజు ఎగ్జిబిషన్ ను వాయిదా వేయాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేవరకు ఇంకా టైమ్ పడుతుందని తెలిపారు. 10 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నట్టు సజ్జనార్ (Sajjanar) వివరించారు.
Read Also: యాదాద్రిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆదర్శ వివాహం
Follow Us On: Instagram


