కలం, కరీంనగర్: రక్షాబంధన్ వేడుకల సందర్భంగా శుక్రవారం రోజు కేంద్ర హోంశాఖ రాష్ట్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కార్పొరేటర్ గొట్టేముక్కుల ఉమా రాణి వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay)కి రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ఆప్యాయతను చాటుతూ జరిగిన ఈ వేడుకలో ఉమా రాణి మంత్రికి తిలకం దిద్ది, ఘనంగా రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు.

