వర్లీలో ఘనంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు

కలం, నిర్మల్: పద్మశాలి సమాజానికి (Padmashali Community) జంధ్యాల పౌర్ణమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. తమ ఆచార, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే ఈ పండుగను దేశవ్యాప్తంగా పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముంబైలోని వర్లీలో పద్మశాలి సమాజక సుధారక మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జంధ్యాల పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. పద్మశాలీల ఆరాధ్య దైవమైన మార్కండేయ మహర్షి చిత్రపటానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

జంధ్యాల పౌర్ణమి విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో దాని ప్రాధాన్యతను పలువురు వివరించారు. అనంతరం రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ వాసాల శ్రీహరి, అధ్యక్షులు కస్తూరి హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వీరబత్తిని సత్యనారాయణ, కొక్కుల రమేష్, ఓబీసీ ఎస్బీసీ ఇన్‌ఛార్జి రాపల్లి సత్యం, అల్లందాస్ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>