Mobile Popup Ad
Mobile Popup Ad

రాత్రి వేళ కొనుగోలు కేంద్రానికి కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ చిత్రా మిశ్రా రాత్రి వేళ కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. రామడుగు మండలం వన్నారం గ్రామంలోని కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి రాత్రి కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిందా, నష్టం జరిగిందా అని ఆరా తీశారు. అలాగే టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా.. అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేసి, ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>