నల్లగొండలో విషాదం.. భవనం పై నుంచి పడి వలస కూలీ మృతి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పై అంతస్తు నుంచి జారిపడి ఓ వలస కూలీ దుర్మరణం చెందాడు. నల్లగొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఓల్డ్ వొడాఫోన్ షోరూం పక్కన జరుగుతున్న భవన నిర్మాణంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన గోపయ్య (28) అనే కార్మికుడు ఐదో అంతస్తులో పనిచేస్తున్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

బతుకుదెరువు కోసం వలస వచ్చి పనిచేస్తున్న గోపయ్య మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, గోపయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల వద్ద కార్మికులకు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. రక్షణ నెట్లు, సేఫ్టీ పరికరాలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో తోటి కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్.. కవిత కొత్త పార్టీ ఎఫెక్ట్ !!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>