epaper
Wednesday, February 18, 2026
epaper

ఏదులాపురం మున్సిపల్ పోరులో ‘హస్తం’ దూకుడు

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ (Edulapuram Municipality) ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టికెట్ల కేటాయింపు, ఎన్నికల వ్యూహాలు మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ మెజార్టీతో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

మంగళవారం మంత్రి పొంగులేటి (Minister Ponguleti) కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌‌లు అందజేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని నేతలు చెబుతున్నారు. బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు సమర్పించాలని మంత్రి సూచించారు.

“అధికారికంగా బీ-ఫామ్‌లు అందాయి.. ప్రభుత్వ ప్రజారంజక పాలనను, అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఏదులాపురంలోని (Edulapuram Municipality) అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: ప్రజలను బీఆర్ ఎస్ నిండా ముంచింది : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>