26 వరకు డెడ్ లైన్.. ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం!

కలం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు (Telangana Employees), ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరోసారి సమరానికి సిద్ధమవుతున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించింది. ఈ నెల 26 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. లేనిపక్షంలో ఈ నెల 27 నుంచి వరుస నిరసనల షెడ్యూలు రూపొందించింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నది.

పీఆర్సీ ఫిట్‌మెంట్ విడుదల, పెండింగ్‌లో ఉన్న డీఏల ఫండ్స్ రిలీజ్, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లులకు పేమెంట్స్, హెల్త్ కార్డుల సమస్యలకు పరిష్కారం, ఉపాధ్యాయుల బదిలీలు – పదోన్నతులు, పలు జీవోలకు సవరణలు.. ఇలాంటి అంశాలపై జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో జరిగిన సమావేశంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, సెకండ్ పీఆర్సీ ఆమలు, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలన్నవి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నది.

ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన

ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ ఉద్యోగ సంఘాల ధర్నా. పీఆర్సీ అమలు చేయకపోతే ప్రతీ రోజు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయం
ఆగస్టు 28 నుంచి : అన్ని జిల్లాల్లోని సంఘాల కార్యవర్గాలను కలిసి తదుపరి కార్యాచరణపై చర్చించి ఆందోళనలకు సిద్ధం చేయడం, సమస్యలపై అవగాహన కలిగించడం, ఉద్యమ ఆవశ్యకతను వివరించడం.
సెప్టెంబరు 1 : అన్ని జిల్లా కేంద్రాల్లో ‘పెన్షన్ విద్రోహ దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (CPS) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS)ను అమలు చేయాలనే డిమాండ్.
సెప్టెంబరు 10 : ‘చలో హైదరాబాద్’ పేరుతో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులను ఆహ్వానించి హైదరాబాద్‌లో ‘మహా ధర్నా’ చేయడం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>