Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ ఇలాకాలో వార్ వన్‌సైడ్.. కాంగ్రెస్ విజయం

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. వార్ వన్‌సైడ్ తరహాలో మూడు చోట్లా కాంగ్రెస్ గెలిచింది. కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవశమయ్యాయి. పురపాలక శాఖ బాధ్యతలను కూడా రేవంత్‌రెడ్డి చూస్తుండడం గమనార్హం. ఆ శాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మూడు చోట్లా కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం విశేషం. ఇందులో కొడంగల్ వికారాబాద్ జిల్లా పరిధిలోకి రాగా కోస్గి, మద్దూర్ నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నాయి.

ఈ మూడు చోట్లా కాంగ్రెస్ గెలవడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన పట్టును కొనసాగించినట్లయింది. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలిచింది. ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో రెండేండ్లలో పలు అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చడం, ముఖ్యంగా కొడంగల్-నారాయణపేట లిప్ట్ ఇరిగేషన్ పనుల ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్ కొల్లాపూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది.

Read Also: డీకే అరుణ ఇలాకాలో బీఆర్ఎస్ విజయం… ఐజ మున్సిపాలిటీ కైవశం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>