కలం, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పార్టీకి ఎలాంటి ఫలితం వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా. మరోవైపు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణకు (DK Aruna) ఆ జిల్లా ప్రతిష్టాత్మకం. మరోదిక్కు ఈ జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటినీ 2018 ఎన్నికల్లో కైవశం చేసుకున్నామని బీఆర్ఎస్ గొప్పలు. వీటన్నింటి నేపథ్యంలో డీకే అరుణకు పట్టు ఉన్న గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో (Ieeja Municipality) తన ప్రభావాన్ని చూపించుకోలేకపోయారు.
మొత్తం 20 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో (Ieeja Municipality) 14 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఆరు వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా బీజేపీ ఒక్కటి కూడా గెల్చుకోలేకపోయింది. ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. సొంత జిల్లాలో అటు సీఎం రేవంత్, ఇటు ఎంపీ డీకే అరుణను కాదని ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: సొంత జిల్లాల్లో జగ్గారెడ్డికి షాక్.. గడ్డపోతారం బీఆర్ఎస్ చేతుల్లో
Follow Us On: Pinterest


