కాంగ్రెస్ స‌ర్పంచ్ అరెస్ట్‌.. అసెంబ్లీ వ‌ద్ద హైడ్రామా!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద ఓ కాంగ్రెస్ స‌ర్పంచ్ (Congress Sarpanch) అరెస్ట్‌తో హై డ్రామా నెల‌కొంది. “నేను కాంగ్రెస్ స‌ర్పంచ్‌ని… అసెంబ్లీ (Assembly) చూసేందుకు వ‌స్తే అరెస్ట్ చేశారు” అంటూ స‌ద‌రు వ్య‌క్తి గ‌గ్గోలు పెట్టాడు. దీంతో పోలీసులు అత‌డిని వ‌దిలిపెట్టారు. కానీ, త‌ర్వాత‌ మీడియా ముందు అత‌డు మాట్లాడిన మాట‌ల‌కు మ‌ళ్లీ అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అసెంబ్లీ గ్యాల‌రీలో కూర్చొని వీక్షించేందుకు కాంగ్రెస్ స‌ర్పంచుల‌కు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో మంత్రి, మాన‌కొండూర్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల సర్పంచులకు పాస్‌లు ఇచ్చారు. దీంతో నేడు అసెంబ్లీని చూసేందుకు వారు హైద‌రాబాద్‌ (Hyderabad)కు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో నేడు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్ట‌డికి వ‌చ్చారు.

పోలీసులు అసెంబ్లీ ప‌రిస‌రాల్లో భారీ ఎత్తున మోహ‌రించి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను అసెంబ్లీ బ‌య‌టే అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ చూసేందుకు వ‌చ్చిన‌ కాంగ్రెస్ స‌ర్పంచ్‌ను కూడా అరెస్ట్ చేసి వాహ‌నంలో ఎక్కించారు. అత‌డు వాహ‌నంలో నుంచి అరుస్తూ తాను కాంగ్రెస్ స‌ర్పంచిన‌ని, అసెంబ్లీ చూసేందుకు వ‌చ్చాన‌ని చెప్పాడు. దీంతో పోలీసులు న‌వ్వుకొని అత‌డిని వ‌దిలేశారు. వాహ‌నం దిగి వ‌చ్చిన స‌ద‌రు స‌ర్పంచ్ పోలీసుల‌ను ఉద్దేశిస్తూ… మీరేం పోలీసులు.. కాంగ్రెస్ పార్టీ స‌ర్పంచ్‌ను (Congress Sarpanch) అరెస్ట్ చేశార‌ని వ్యాఖ్యానించారు. దీంతో మ‌ళ్లీ పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని వాహ‌నంలోకి ఎక్కించేందుకు ప్ర‌య‌త్నించారు. “మీకు దండం పెడ‌తా.. కాంగ్రెస్ పార్టీ నాది.. న‌న్ను వ‌దిలేయండి” అని బ‌తిమాలుకున్నాడు. కాసేప‌టి త‌ర్వాత పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని వ‌దిలేశారు. అసెంబ్లీ చూద్దామ‌ని వ‌స్తే అరెస్ట్ చేశార‌ని ఆ సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>