Mobile Popup Ad
Mobile Popup Ad

59 ఏళ్ల తరువాత తీరబోతున్న కాంగ్రెస్ పార్టీ కోరిక

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ పార్టీ (Congress Party) కోరిక 59 ఏళ్ల తరువాత తీరబోతుంది. రేపు హస్తం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మే 10న కొలువుదీరిన విజయ్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి 10 మంది మంత్రులు ఉండగా.. రేపు మరో ఇద్దరు కొత్తగా చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చివరి సారి 1967లో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత, ద్రవిడ పార్టీల రాకతో పార్టీ మూడో స్థానానికి పడిపోయింది.

ప్రభుత్వం ఏర్పాటు పక్కనపెడితే.. కనీసం పలుమార్లు కూటముల్లో భాగంగా ఉన్నా మంత్రి వర్గాల్లో చేరలేకపోయింది. ఎట్టకేలకు ఆ కోరిక రేపు నెరవేరబోతుంది. గత ఎన్నికల్లో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. మంత్రి పదవులు ఇచ్చేందుకు మాత్రం స్టాలిన్ (MK Stalin) నిరాకరించారు. అయితే, విజయ్ టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చినా, మెజార్టీ రాకపోవడంతో 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు అనివార్యమైంది. దీంతో ఒప్పందం ప్రకారం రెండు మంత్రి పదవులు దక్కాయి.

పార్టీకి చారిత్రాత్మక సందర్భం..

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులు ఉండటం చారిత్రాత్మక సందర్భమని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్ అన్నారు. ఇద్దరు కొత్త మంత్రులు రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఉత్తమ పాలన అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్ పేర్లకు జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆమోదముద్ర వేశారని ప్రకటించారు.

Read Also: స‌ర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ భేటీ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>