కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ (రాహుల్- రేవంత్) వసూళ్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. నిన్న ఆయన లోక్ సభలో (Lok Sabha) ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిల్డర్ల నుంచి నిధులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరిజ్జీవం, తెలంగాణ అప్పులపై ఎంపీ చామల మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళనకు (Musi Rejuvenation) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకులో 500 మిలియన్ డాలర్ల లోన్ కోసం ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టును రెడీ చేశామని, ఈ రిపోర్టును కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖా మంత్రికి, నీతి ఆయోగ్‌కు సమర్పించామని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి దోచుకుందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డినుద్దేశించి చామల మండిపడ్డారు. బీఆర్ఎస్ దోచుకుంటుంటే బీజేపీ నాయకులు పదేళ్లు సైలెంట్‌గా ఉన్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో రెండవ దశ, ట్రిపుల్ ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు సహకరించాలని ఎంపీ చామల (MP Chamala) లోక్‌సభలో గళమెత్తారు.
Read Also: హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ వీడియో
Follow Us On: Sharechat

