కలం, నిజామాబాద్ బ్యూరో: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget)ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రశంసించారు. ఈ బడ్జెట్ రైతులకు, ప్రజలకు అనుకూలంగా ఉండటంతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది మైనార్టీల సమగ్రాభివృద్ధి, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండటం, మైనారిటీల సంక్షేమాన్ని సూచిస్తుందని తెలిపారు. మైనార్టీ మహిళలకు 10,000 కుట్టు యంత్రాల పంపిణీ, 4,655 మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
అలాగే రాజీవ్ యువ వికాసం పథకానికి (Rajiv Yuva Vikasam Scheme) రూ.6,000 కోట్లు కేటాయించడం పట్ల కూడా షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా అన్ని వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. సీఎం భట్టి విక్రమార్కను ప్రశంసిస్తూ ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించిందని షబ్బీర్ అలీ (Shabbir Ali) కితాబు ఇచ్చారు.
Read Also: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలం.. ఎస్పీ ప్రకటన
Follow Us On: Youtube

