నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలం.. ఎస్పీ ప్రకటన

కలం, నల్లగొండ బ్యూరో : జిల్లా (Nalgonda) పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి చెందిన ఉపయోగించకుండా కాలం చెల్లిన పోలీస్ వాహనాల పాత టైర్లు, బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్స్, ఇతర ఇనుప విడి భాగాలపై వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం కార్యక్రమాన్ని ఈనెల 25(బుధవారం) ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వేలంలో పోలీస్ వాహనాలకు సంబంధించిన వివిధ రకాల పాత టైర్లు, ఆయిల్, పాత బ్యాటరీలు, స్పేర్ పార్ట్స్ తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయి. వేలంలో పాల్గొనాలనుకునే వారు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరై వేలంలో పాల్గొనాలని సూచించారు.

Read Also: షాకింగ్.. భారత్ లో భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>