Mobile Popup Ad
Mobile Popup Ad

దేశ భవిష్యత్తు జెన్ జీ చేతిలోనే ఉంది: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కలం, మెదక్ బ్యూరో : భారతదేశ భవిష్యత్తు నేటి ‘జెన్ జీ’ యువత చేతుల్లోనే ఉందని, సాంకేతికతను సామాజిక బాధ్యతతో ముడిపెట్టి యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. శనివారం సంగారెడ్డి లో ‘నమో జెన్ జీ’ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అంజిరెడ్డి మాట్లాడారు..

సోషల్ మీడియాను కేవలం వినోదానికే కాక.. సామాజిక చైతన్యానికి, దేశభక్తికి వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ ప్రపంచంలో పెరిగిన సైబర్ మోసాలు, ఫేక్ న్యూస్ పట్ల యువత ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు . సాంకేతికతను సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాకుండా సమాజ శ్రేయస్సు కోసమే వాడాలన్నారు.

పర్యావరణ పరిరక్షణ, హరిత జీవనశైలిని అలవర్చుకుంటూ ప్రకృతిని కాపాడటంలో యువతే ముందుండాలన్నారు. వార్డు, గ్రామ, మున్సిపల్ అభివృద్ధి పనుల్లో యువత భాగస్వామ్యం పెరగాలని, ప్రజా సమస్యలపై గళమెత్తడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్య బలోపేతం సాధ్యమని స్పష్టం చేశారు. జెన్ జీ (Gen Z) యువత కేవలం ఓటర్లుగానే కాదు.. రేపటి పాలకులుగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్ దేశ్ పాండే, బీజేవైఎం రాష్ట్ర ట్రెజరరీ నరేన్ దేశ్ పాండే, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు తదితరులు ఉన్నారు.

Read Also: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>