కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ కార్పొరేషన్‌ను (Nizamabad Corporation) కాంగ్రెస్ కైవసం చేరుకుంది. బీఆర్ఎస్ (BRS) ఏకైక కార్పొరేటర్ విజయలక్ష్మి ఓటుతో పాటు ఎంఐఎం (AIMIM) 14 మంది ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి కార్పొరేషన్‌ను చేజిక్కించుకుంది. నిజామాబాద్‌లో 60 డివిజన్లు ఉండగా ఏ పార్టీకి అనుకూలమైన ఫలితాలు రాలేదు. బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ నిజమాబాద్‌లో గెలిచారు. హంగ్ ఫలితాలతో వేర్వేరు పార్టీలు చేతులు కలిపాయి. మేయర్ పదవి దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 కావాలి. దీంతో క్యాంపులో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం లు చేతులు కలిపాయి.
ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలుపుకొని కాంగ్రెస్ బలం 34 కు చేరుకుంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఉమారాణికి (Uma Rani) మద్దతుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో అధికారులు ఉమారాణిని మేయర్‌గా ప్రకటించారు. బీజేపీకి వచ్చిన 28 కార్పొరేటర్ స్థానాలతో పాటు నిజామాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలతో 31 ఓట్లు అయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు (Nizamabad Corporation) ఎన్నికైన అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించారు.
Read Also: చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. తెలంగాణలో 11 మున్సిపాలిటీలు వాయిదా
Follow Us On: Instagram


