epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణ జాగృతిలో చేరిన కావేటి మనోహర్

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ (BRS) పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ (Kaveti Manohar Kumar) తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం మనోహర్ కుమార్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా జాగృతిలో చేరారు.

ఈ సందర్భంగా కావేటి మనోహర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతిలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవితకు (Kavitha) మద్దతునివ్వడం కోసం జాగృతిలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ది కవితతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ పంథాను అవలంబిస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ జాగృతికి ప్రజల్లో మరింత ఆద‌రణ లభిస్తున్నదని పేర్కొన్నారు. జాగృతిని బలోపేతం చేయడానికి తాను పని చేస్తానని స్పష్టం చేశారు.

Read Also: ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ నాయకుల దాడి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>