తెలుగు బిస్ బాస్(Bigg Boss) షోకు భారీ షాక్ తగిలింది. ఈ షోను నిపివేయాలని కోరుతూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఈ షో ఉంటుందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి షోను నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ కలిసి జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘కుటుంబ విలువలను పాటించని దివ్వెల మాధురి, రీతు చౌదరి లాంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా తీసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు’’ అని ప్రశ్నించారు. కర్ణాటకలో చేసినట్టు ఇక్కడ కూడా బిగ్ బాస్ షో బ్యాన్ చేయకపోతే, మహిళ సంఘాలు, ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌసును ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Also: దుల్కర్‌కు భారీ షాక్.. హెరాష్‌మెంట్ కేస్ నమోదు..

