వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? సరైన లోడ్ ఎంత?

కలం, వెబ్‌డెస్క్: ఆధునిక మానవ జీవితాన్ని సులభతరం చేసిన అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలలో ‘వాషింగ్ మెషీన్’ (Washing Machine) అత్యంత ముఖ్యమైనది. ఒకప్పుడు బట్టలు ఉతకడం అనేది శారీరక శ్రమతో కూడిన, ఎక్కువ సమయం తీసుకునే ఒక పెద్ద పనిగా ఉండేది. కానీ, మారుతున్న కాలంతో పాటు సాంకేతికత పెరగడం వల్ల వాషింగ్ మెషీన్ ప్రతి ఇంటిలోనూ ఒక విడదీయరాని భాగమైంది. బట్టలను నానబెట్టడం, రుద్దడం, పిండడం, ఆరబెట్టడం వంటి పనులన్నింటినీ ఇది కేవలం ఒక బటన్ నొక్కుతో, అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది.

కానీ ఒక చిన్న పొరపాటు మీ ఖరీదైన మెషీన్‌ను పనికిరానిదిగా మార్చగలదని మీకు తెలుసా? మెషీన్‌ను ఓవర్‌లోడ్ చేయడం, లేదా దాని సామర్థ్యానికి మించి బట్టలతో నింపడం అత్యంత ప్రమాదకరం అని సూచిస్తున్నారు నిపుణులు. మెషీన్ లైఫ్ టైమ్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఒకేసారి ఎన్ని బట్టలు ఉతకడం సరైనదో తెలుసుకుందాం.

ఓవర్ లోడ్ చేయడం వలన కలిగే నష్టాలు

మీరు వాషింగ్ మెషీన్‌లో (Washing Machine) బట్టలను అధికంగా వేసినప్పుడు అది డ్రమ్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మోటారు వేడెక్కి పాడైపోవచ్చు. అంతేకాకుండా అధికంగా బట్టలు వేయడం వల్ల అవి సరిగ్గా తిరగవు. దీనివల్ల డిటర్జెంట్ అవశేషాలు బట్టలపై మిగిలిపోయి, ఉతికిన తర్వాత కూడా అవి మురికిగా దుర్వాసనగా ఉంటాయి. అయితే ప్రతి వాషింగ్ 6 కేజీలు, 7 కేజీలు లేదా 8 కేజీలు వంటి నిర్దిష్ట సామర్థ్యం ఉంటుంది. మీరు దానిని బట్టలతో అధికంగా నింపాలని కాదు.

6 కేజీల మెషిన్: ఒకేసారి సుమారు 8 నుండి 10 బట్టలు.
7 కేజీల మెషిన్: ఒకేసారి సుమారు 11 నుండి 13 బట్టలు.
8 కేజీల మెషిన్: ఒకేసారి గరిష్టంగా 14 నుండి 16 బట్టలు ఉతికే సామర్థ్యం ఉంటుందని సూచిస్తున్నారు.

బట్టలు సర్దే ముందు ఈ ఒక చేతి నియమాన్ని పాటించండి

మెషీన్‌లో బట్టలు పెట్టిన తర్వాత పైభాగంలో కొంత ఖాళీ వదలండి. ఇప్పుడు మీ చేతిని డ్రమ్‌లోకి చొప్పించండి. బట్టలకు, డ్రమ్ పై గోడకు మధ్య మీ చేయి సులభంగా కదలగలిగితే లోడ్ సరిగ్గా ఉన్నట్లని సూచిస్తున్నారు. ఒకవేళ మీ చేతిని చొప్పించడానికి చోటు లేకపోతే, వెంటనే కొన్ని బట్టలను తీసివేయాలట.

  • వాషింగ్ మెషీన్ డ్రమ్‌ను ఎల్లప్పుడూ 70-80% మాత్రమే నింపండి. మెషీన్‌ను ఎప్పుడూ పూర్తిగా పై వరకు నింపవద్దు.
  • అవసరమైన దానికంటే ఎక్కువ డిటర్జెంట్ కలపడం వల్ల అధిక నురుగు ఏర్పడి, అది మోటారును పాడు చేస్తుంది.
  • మందపాటి జీన్స్‌ను, తేలికపాటి బట్టలను ఎల్లప్పుడూ వేర్వేరుగా ఉతకండి.

Read Also: వెయిట్ లాస్ కోసం ఏది బెస్ట్.. బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>