Mobile Popup Ad
Mobile Popup Ad

టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేయబోతున్న కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ తీసేసి మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

టీఆర్ఎస్‌లో చేరికలు

ఆదివారం కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన)లో చేరారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యునివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు చెన్నమల్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గుగులోతు దివ్య, చింతకుంట మాజీ వార్డ్ సభ్యుడు గుర్రం సత్యం గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు లింగంపల్లి శ్రీనివాస్‌లతోపాటు పలువురు విద్యార్థి యువజన, మహిళ విభాగం నాయకులు కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా కవిత వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.

రైతులకు నష్టం చేస్తే సహించొద్దు

చేరికల అనంతరం కవిత మాట్లాడుతూ.. రైతులకు నష్టం చేసే రైతు డిస్కం‌కు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలకు రాష్ట్ర సర్కార్ వత్తాసు పలుకుతోందని కవిత ఆరోపించారు.

మేం అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, విద్య

మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లాకావత్ రూప్ సింగ్, లింగంపల్లి నాగరాజు, మల్లారెడ్డి, బుడిగె పర్శారం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బండ అశోక్, కొండపాక రాకేష్ రెడ్డి సబ్బు నాగరాజు నాగునురి రమేష్ చారి, పూజ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>