Mobile Popup Ad
Mobile Popup Ad

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీలు మృతి

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బాగేపల్లి (bagepalli Karnataka) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుకనుంచి వచ్చిన కంటైనర్ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ పనులు ముగించుకున్న కూలీలు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>