కలం, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న బర్గి డ్యామ్ (Bargi Dam)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు నీట మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో సుమారు 30 మంది పర్యాటకులు బోటులో ఉన్నారు. పడవ ప్రయాణిస్తుండగా బలమైన గాలులు వీచి పడవ నియంత్రణ కోల్పోయి మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే 15 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. తీవ్ర గాలులు, పరిమితికి మించి బోటులో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జబల్‌పూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు, ఎస్డీఈఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రతిపాదికన గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వాతావరణం అకస్మాత్తుగా మారడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే భద్రతా నిబంధనల ఉల్లంఘటన ఏమైనా జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
Follow Us On: WhatsApp

