ఆర్‌సీబీని చిత్తు చేసిన గుజరాత్..

కలం, స్పోర్ట్స్ : అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌ (RCB vs GT) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ చుక్కలు చూపించారు. బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలోనూ అదరగొట్టారు. ఆర్‌సీబీ ఇచ్చిన టార్గెట్‌ను కేవలం 15.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించారు. శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు రాహుల్ తెవాటియా బాధ్యతాయుతమైన ఆట తీరు గుజరాత్‌కు ఘనవిజయాన్ని అందించాయి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ (5) త్వరగానే వెనుదిరిగినా, విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. జట్టులో అత్యధికంగా దేవదత్ పడిక్కల్ 24 బంతుల్లో 40 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (19), రొమారియో షెపర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12) తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. చివర్లో భువనేశ్వర్ కుమార్ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ (2/19), జేసన్ హోల్డర్ (2/29) అద్భుతంగా రాణించారు.

156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి ఆధిపత్యం చాటాడు. జోస్ బట్లర్ సైతం 19 బంతుల్లో 39 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి గెలుపును సులభం చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ తెవాటియా 17 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా జట్టును గెలిపించలేకపోయాడు. రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీయగా, జోష్ హేజిల్‌వుడ్ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 56 పరుగులు ఇచ్చాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>