పాఠశాలను సందర్శించిన కలెక్టర్ చాహత్

కలం, వరంగల్ బ్యూరో: అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) సూచించారు. మంగళవారం శాయంపేట మండలం మైలారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.అంగన్వాడీ కేంద్రంలో ‘పోషణ్ అభియాన్ యాప్‌’లో నమోదు చేసిన బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల వివరాలను పరిశీలించి హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆంగ్ల పద్యాలను చదివించి వారి అభ్యాస స్థాయిని కలెక్టర్ అంచనా వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Chahat Bajpai) మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను.. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు సక్రమంగా అందేలా చూడాలని హెచ్చరించారు. వన నిర్మాణానికి సంబంధించిన మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పూర్తయిన టాయిలెట్లకు రంగులు వేయాలని, పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలి..

మైలారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్ నిల్వలు, విద్యుత్ దీపాల పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నూనె దివ్య, పరకాల ఆర్డీవో (RDO) కన్నం నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీవో (MPDO) ఫణి చంద్ర, తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ(MEO) భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘట్టంలో తుమ్మల కీలకం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>