Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు భరోసా.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రైతు భరోసా, సంక్షేమ పథకాలపై నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క (Seethakka) తీవ్రంగా కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంపిణీ తీరును ఎండగడుతూ కీలక విషయాలను ఆమె మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదని, నెలల తరబడి సాగదీశారని విమర్శించారు. 2018 యాసంగిలో 161 రోజులు (దాదాపు 6 నెలలు), 2022-23 యాసంగిలో 148 రోజులు నిధుల పంపిణీకి సమయం పట్టిందని గణాంకాలతో సహా సీతక్క గుర్తుచేశారు.

గత వానాకాలం సీజన్‌లో కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశామని సీతక్క (Seethakka) తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా తమదేనని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎగతాళి చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే ఆయన మాట్లాడుతున్నారన్నారు. దీనిని మహిళాలోకం గమనిస్తోందని సీతక్క హెచ్చరించారు. గతాన్ని ఒకసారి సరిచూసుకోవాలని, అనవసరపు విమర్శలు మానుకోవాలని కేసీఆర్‌కు మంత్రి సీతక్క హితవు పలికారు.

Read Also: జీతాలు కట్ చేసిన సీఎం.. దేశంలోనే మొదటిసారి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>