Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) అధికారులను ఆదేశించారు. మంగళవారం తహసీల్దారులు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 83,635 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామని, దీనికి అనుగుణంగా 168 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే 56 కేంద్రాలకు ధాన్యం చేరిందని, ముఖ్యంగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ధాన్యం వచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రేడింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టెంట్లు, త్రాగునీరు, విద్యుత్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని, కూలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించాలని, తడి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ఆన్‌లైన్ నమోదు, మిల్లుల కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ (Collector Ankit) ఆదేశించారు.

Read Also: ‘ప్రధాని మోదీని నేను అలా అనలేదు’.. ఖర్గే ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>