పీఎం సూర్యఘర్ యోజనపై కలెక్టర్ అంకిత్ సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)  జిల్లా ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన”( PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సోలార్ విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అంకిత్ (Collector Ankit) చెప్పారు. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తిరిగి ఆదాయం పొందే అవకాశమూ ఈ పథకం ద్వారా లభిస్తుందని వివరించారు. సబ్సిడీ వివరాలపై మాట్లాడుతూ, 2 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.30,000 చొప్పున, 3వ కిలోవాట్‌కు, అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి అదనంగా రూ.18,000 వరకు, మొత్తం రూ.78,000 వరకు సబ్సిడీ అందించబడుతుందని తెలిపారు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో అవసరమని చెప్పారు. అర్హులైన వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకుని రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కస్టమర్ నంబర్ వంటి వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్సీ జి. మహేందర్, టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి. అజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: యుద్ధం ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>